మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు
కరీంనగర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : కరీంనగర్ ఫిలిం సొసైటీ కి జాతీయస్థాయిలో గుర్తింపు పొందండం గర్వించదగ్గ విషయమని శాసనమండలి సభ్యుడు మాజీ సభ్యుడు , ఫిలిం సొసైటీ సలహాదారుడు నారదాసు లక్ష్మణరావు అన్నారు. ఆదివారం కరీంనగర్ ఫిలిం భవన్ లో కరీంనగర్ ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
1977 నుండి 47 సంవత్సరాలుగా అప్రహాతంగా కొనసాగుతున్న ఫిలిం సొసైటీ కార్యక్రమాల వెనుక అనేకమంది సామాజిక చింతనాపరుల కృషి ఉందని గుర్తు చేశారు. అంపశయ్య నవీన్ మొదలు పొన్నం రవిచంద్ర వరకు అనేకమంది కృషి ఫలితంగానే ఫిలిం సొసైటీ ముందుకు సాగుతుందని అభినందించారు.
సైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ సభ్యుల సూచన మేరకు ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ నిర్వహిస్తామన్నారు.