calender_icon.png 17 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లింట విషాదం....

31-08-2024 02:29:59 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు 

హుజురాబాద్, విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామం వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్ళంట విషాదం నెలకొంది. స్థానికుల, పోలీసులు వివరాల ప్రకారం కాట్రపల్లి గ్రామానికి చెందిన హనుమయ్య కొడుకు వివాహ వేడుకలు శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని మచ్చ గిరేంద్రస్వామి ఆలయంలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కాట్రపల్లి నుండి ఆటోలో వెళుతుండగా సింగపురం వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో తాడూరి రాజమౌళి(70 ) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం తాడూరి ధర్మయ్య, హనుమయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ జిల్లాలోని ఎంజిఎంకు తరలించినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.