calender_icon.png 29 April, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ - డిపోకు అత్యుత్తమ కే.ఎం.పి.ఎల్, మైలేజ్ అవార్డులు

25-04-2025 12:42:00 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): అశోక్ లీలాండ్, ఆటోమోటివ్ సంస్థ ఆధ్వర్యములో హైదరాబాద్ లోని మారియట్ హెూటల్లో నిర్వహించిన టెక్నికల్ సెమినార్ నందు బిఎస్ - 6 బస్సుల యందు అత్యుత్తమ హెచ్‌ఎస్‌ఓ కేఎంపీఎల్ అయిన 5.86 సాధించినందుకు, అశోక్ లీలాండ్ ఇంజన్ హై మైలేజ్ అయిన 20.40 లక్షల కిలోమీటర్లను సాధించినందుకు గాను రాష్ట్ర స్థాయిలో అవార్డులను కరీంనగర్- 2 డిపో సాధించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వి. మునిశేఖర్, బస్ భవన్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ జోన్ శ్రీ ఖుస్రో షా ఖాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న చేతుల మీదుగా కరీంనగర్ రీజనల్ మేనేజర్  బి. రాజు, కరీంనగర్ - 2 డిపో మేనేజర్  శ్రీనివాస్, గతంలో కరీంనగర్ - 2 డిపో మేనేజర్ గా పనిచేసిన వి. మల్లయ్యలు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ బి. రాజు మాట్లాడుతూ ఇంతటి గుర్తింపుకు కారణం కరీంనగర్ - 2 డిపో సిబ్బంది కృషి అని సిబ్బందిని అభినందించారు. ఇదే స్పూర్తిని ఇక ముందు కూడా కొనసాగించి మరెన్నో మైలురాళ్ళు సాధించాలని ఆకాంక్షించారు.