calender_icon.png 8 January, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం, గంగులతో చర్చిస్తా: కేంద్రమంత్రి బండి సంజయ్

14-07-2024 12:20:42 PM

కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత నాది

హైదరాబాద్: జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ ను కరీంనగర్ కార్పొరేటర్లు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కు నిధులు తెచ్చే బాధ్యత నాది. కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై  మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమాలాకర్ తోనూ చర్చిస్తానని వెల్లడించారు. స్మార్ట్ సిటీ మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు.