calender_icon.png 30 October, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్

19-07-2024 12:05:00 AM

తప్పుడు అంగవైకల్యం సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారని ఆరోపణలు

న్యూఢిల్లీ, జూలై 18 : యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సంపాదించిన వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రఫుల్ దేశాయ్ నకిలీ అంగవైకల్యం పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందారని నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ప్రఫుల్ దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ ఉద్యోగం సాధించాడు. అయితే, ఆయన ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ వంటి సాహసాలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీ సర్టిఫికెట్లకు మీ సాహాసాలకు సంబంధమేంటో వివరించా లని నిలదీస్తున్నారు.

దీనిపై స్పందించిన ప్రఫుల్ దేశాయ్.. తాను దివ్యాంగుడినని నిర్ధారిస్తూ 45 శాతం అంగవైకల్యం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ సర్టిఫికెట్ ఇచ్చిందని, ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. సదరు ఫోటోలు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగమని, దివ్యాంగుడినైనా తాను పరిస్థితిలను అధిగమించి అందరిలా జీవించాలని ప్రయత్నించడం తప్పా అంటూ నెటిజన్‌కు సమాధానమిచ్చారు. 2019లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలో ప్రఫుల్ దేశాయ్ 532 ర్యాంకు సాధించారు.