calender_icon.png 2 April, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలి

01-04-2025 02:35:48 AM

  1. పిల్లలకు క్రీడలపట్ల ఆసక్తిని పెంచాలి 
  2. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి) : కరాటే ప్రతి  ఒక్కరి జీవితంలో భాగం కావాలని, మార్షల ఆర్ట్స్ నా జీవితంలో ఓ భాగమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆత్మ విశ్వాసానికి, ఆత్మస్థు ర్యానికి కరాటే ఎంతో అవసరమన్నారు.  ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో సోమవారం సికింద్రాబాద్‌లోని వైడబ్యూసీఏలో నిర్వహించిన పరీక్షలో  మహేష్ కుమార్‌గౌడ్ విజయం సాధించగా  కరాటే బ్లాక్ బెల్డ్ డాన్ 7 ప్రధానం చేసి సర్టిఫికెట్ అందజేశారు. 

ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒక వైపు రాజకీ యంగా, ఎమ్మెల్సీగా నిరంతరం ప్రజాసేవలో బీజీగా ఉన్నప్పటికి కరాటేకు సమ యం కేటాయిస్తానని తెలిపారు.  సమాజం లో క్రీడల పట్ల  ఆసక్తి ఉండాలన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్‌లా తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, పిల్లలకు క్రీడలపట్ల ఆసక్తి చూపించాలని, శారీరక ఆరోగ్యగానికి క్రీడలో, వ్యాయామం ఎంతో అవసమన్నా రు.

కరాటే రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షులుగా కరా టే పోటీలను నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కరాటే బ్లాక్‌బెల్డ్ డాన్ 7 సర్టిఫికేట్ తీసుకోవడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.

కరాటే పోటీలలో భాగంగా తాను పలు దేశాలలో పర్యటించానని తెలిపారు.  ఆస్ట్రేలి యా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో  ఇంటికో క్రీడాకారుడు ఉంటారని చెప్పారు. 2027లో కూడా ఆసియా కరాటే పోటీలను ఇక్కడే నిర్వహిస్తామన్నారు.