- ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు శిక్షణ తరగతులు
- మూడు నెలల పాటు శిక్షణ
- ఆసక్తిగా నేర్చుకుంటున్న బాలికలు
- జిల్లా వ్యాప్తంగా ప్రారంభం
సిరిసిల్ల, జనవరి 1 (విజయక్రాంతి): మహిళ ఒంటరిగా ఆర్ధరాత్రి పూట నడుచు కుంటు వెళ్లినప్పుడే నిజమైనా స్వాతంత్య్రం వచ్చినట్లు చెప్పిన జాతిపిత గాంధీజీ మాటలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. విద్యార్ధి దశ నుంచే బాలికల్లో ఆత్మ స్థుర్యైం నింపేందుకు చర్యలకు శ్రీకారం చుట్టింది.
రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు ఉచితంగా కరాటే శిక్షణ తరగతుల నిర్వహణ కార్య క్రమం చేపట్టింది. రాణి లక్ష్మిబాయి ఆత్మ రక్ష ణ పరిశిక్షణ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో 6 వ తరగతి నుంచి 10వ తరగతి బాలికలకు కరాటే క్లాసులు నేర్చుకునేలా కార్యక్రమం తీసుకోచ్చింది. వీరికి కరాటే నేర్పించేందుకు నిష్ణాతులైనా శిక్షకులను ఎంపిక చేసి, పాఠశా లలకు కేటాయించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 139 జడ్పీ ఉన్నత పాఠశా లల్లో బాలికలకు కరాటే క్లాసులు నిర్వహిం చేందుకు ఎంపిక చేసి, ప్రారంభించింది. గత నెలలో ఎంపిక చేసిన పాఠశాలలో కరాటే శిక్షకులు బాలికలకు క్లాసులు నిర్వహించారు. వారానికి మూడు క్లాసుల చొప్పున నిర్వహి స్తున్నారు. మధ్యహ్నం పూట బాలికలకు 45 నిమిషాలు శిక్షణ ఇస్తున్నారు. కరాటే నేర్చుకునేందుకు బాలికలు ఆసక్తి కనబరుస్తు న్నారు.
బాలికలు నేర్చుకునేందుకు ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు మరింత ప్రొత్సహం ఇవ్వడంతో పాఠశాలల్లో కరాటే క్లాసులు నిరంతరాయంగా సాగుతున్నాయి. సబ్జెక్ట్స్ తో పాటు కరాటే కూడా ఒక సబ్జెక్ట్ కావడంతో బాలికలు శిక్షణలో పాల్గొంటు న్నారు. శిక్షణ తరగతుల్లో బాలిక లకు ప్రాథ మికంగా ఎక్సర్సుజ్ నేర్పించడంతో పాటు కిక్స్,పంచ్లు, టెక్నిక్స్, ముఖ్యంగా శత్రువుల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలను నేర్పిస్తున్నారు.
వీటితో బాలికల్లో ఆత్మస్థుర్యైం పెంపొందుతుంది. అంతేకా కుండా శారీర కంగా, మానసింగా దృఢంగా తయారు అవుతున్నారు. ప్రశాంతంగా ఉండడంతో చదువు పై శ్రద్ధ పెరగడంతో పాటు ఆకలి పెరుగుతోంది. మహిళల పట్ల జరుగు తున్న దాడులను ప్రతిఘటించేందుకు కరాటే ఎంతో దోహపడడంతో పాటుగా బాలికలకు బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో వారికి కరాటే కవచం లాగా పనిచేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలో బాలికలు కరాటే నేర్పించడంతో, ప్రైవేట్ పాఠశాలల సైతం తప్పని సరిగా కరాటే క్లాసులు ఉండేలా మొగ్గుచూపుతున్నారు. అయితే బాలికలకు శిక్షణ ఇచ్చే కరాటే ఇన్స్ట్రక్టర్లు ప్రభుత్వం ప్రతి నెల గౌరవ వేతనంగా రూ.5 వేలు చెల్లించేం దుకు ముందుకు వచ్చింది.
ప్రతి పాఠశా లలో మూడు నెలలకు గాను రూ.15 వేలు అందించేందుకు ఇప్పటికే పాఠశాల హెఎంల ఖాతాల్లో డబ్బులు జమా చేసింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యేడాది పొడవున బాలికలకు కరాటే క్లాసులు ఏర్పాటు చేయాలని విద్యా ర్థులు, తలిదండ్రుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
కరాటేను సబ్జెక్ట్ చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించడం మంచి ఆలోచన. అదేవిధంగా పాఠశాలలో కరాటేను సబ్జెక్ట్ గా ప్రతి రోజు నేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాఠశాలకు ఇన్ స్ట్రక్టర్ నియమిస్తే, నిరుద్యోగ సమస్య తిరడం తో పాటు బాలికలకు మరింత ఆత్మ స్థుర్యైం కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం కరాటేనే యేడాది పాటు కొనసాగించేలా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
నేరేళ్ల శ్రీధర్ గౌడ్,
కరాటే ఇన్ స్ట్రక్టర్ వేములవాడ
ధైర్యంగా ఉంది
స్కూల్లో కరాటే నేర్చుకుంటే ధైర్యంగా ఉంది. స్కూల్కు రోజు రెండు కిలో మీటర్ల నుంచి వస్తున్నాం. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు గతంలో భయం వేసేంది. ఇప్పుడు ఆ భయం లేకుండా పోయింది. సార్లు, తల్లిదండ్రులు చాలా ప్రొత్సహిస్తు న్నారు. నేర్చుకున్న కరాటీతో పోటీల్లో పాల్గొని, బడికి గోల్డ్ మెడల్ తీసుకరావాలనే లక్ష్యం ఉంది.
గంగాదేవి, పదో తరగతి విద్యార్థిని బావుసాయిపేట
మానసిక ధృఢత్వం పెరిగింది
కరాటే నేర్చుకోవడం ద్వారా నాలో మానసిక ధృఢత్వంతో పాట మానసికంగా ఉల్లాసంగా ఉంది. చదువు పై శ్రద్ధ పెరగడంతో పాటు ఎదో శక్తి వచ్చిచనట్టు అనిపిస్తుంది. పూర్తిస్థాయి కరాటే నేర్చుకోవాలని ఉంది. చిన్నప్పటి నుంచి బాలికలకు కరాటే నేర్పించాలని, చదువు పూర్తి చేసుకోని వెళ్లిపోతే కరాటేకు దూరం అవుతామనే బాధ ఉంది.
సల్మా, పదో విద్యార్ధిని, బావుసాయిపేట