బెంగళూరు: ఐటీఎఫ్ కలాబురగై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్, నాలుగో సీడ్ కరన్ సింగ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో కరణ్ 6-4, 6-3తో సహచరుడు నితిన్ కుమార్‌ను ఓడించాడు. కరణ్‌తో పాటు ఆర్యన్ సింగ్ 6-3, 6-3తో మనీశ్ సురేశ్‌పై, సిద్ధార్థ్ రావత్ అమెరికాకు చెందిన ఆధిత్య గణేషన్‌పై, దేవ్ జావియా ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ రిప్కీపై విజయాలు సాధించారు. డబుల్స్‌లో నిక్ చాపెల్-నితిన్ కుమార్, సిద్ధాంత్-విష్ణు వర్దన్, రిషబ్ అగర్వాల్-కబీర్ హన్స్ జోడీలు సెమీస్‌లో అడుగుపెట్టాయి.