28-03-2025 10:16:02 PM
ఎస్ఐ చంద్రమోహన్
జగదేవపూర్,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటైతే జీవితాలు దుర్భరంగా మారుతాయి అని జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్(Jagdevpur SI Chandramohan) అన్నారు. జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం కను విప్పు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ సిద్దిపేట కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాల ప్రజలకు,యువతకు గంజాయి, సైబర్ క్రైమ్, డ్రగ్స్, మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట కళాజాత బృందం, స్థానిక పోలీస్ సిబ్బంది లింగం, నర్సయ్య, శశికాంత్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.