- లైసెన్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా కొనుగోళ్లు
- అధికారుల నిఘా కరువు
- తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు
కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): పత్తి రైతులకు దళారులు శఠగోపం పెడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి లైసెన్స్ లేకుండానే పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, భిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్, నస్రూల్లాబాద్, సదాశివనగర్ మండలాల్లో దళారులు జోరుగా జీరో దందాను కొనసాగిస్తున్నారు.
దళారులకు బ్రోకర్లు సహకరించడంతో మూడు పువ్వు ఆరు కాయలుగా దందా సాగుతున్నది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారు. రైతులకు కనీసం రసీదు కూడా ఇవ్వకుండా దళారులు, బ్రోకర్లు పత్తి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.
ఏటా రూ.కోట్లలో వ్యాపారం
జిల్లా వ్యాప్తంగా దళారులు, బ్రోకర్లు ఏటా రూ.కోట్ల పత్తి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. రైతులను మాయ బుట్టలో వేసుకుని పెట్టుబడి సాయాన్ని అందించి తమ ఉచ్చులోకి దించుకుంటున్నారు. పంట విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, మందు ఇచ్చి రైతులు ఇతరులకు పత్తిని అమ్ముకోకుండా చేస్తున్నారు.
రైతుల మధ్యనే దళారులను పుట్టించి కొనుగోలు చేపడుతున్నారు. రైతుల వద్ద తక్కువ రేటుకు కొని, ఆదిలాబాద్, మద్నూర్‌లోని సీసీఐ ప్రైవేట్ మిల్లులకు తరలిస్తూ అధిక రేటుకు అమ్ముకుంటున్నారు.
ఎలాంటి పత్రాలు లేకున్నా..
పత్తిని కొనుగోలు చేయడానికి రైతుల భూమి పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ ఖాతా, సెల్ నంబర్స్ కావాల్సి ఉండగా వీటిని కొనుగోలు చేసిన దళారులు, బ్రోకర్లు రైతుల నుంచి సేకరిస్తున్నారు. రైతుల పట్టాపాస్ పుస్తకం, ఏ రకం పంట వేశారో వ్యాపారులు కార్యాలయంలో ఓటీపీ ద్వారా తెలుసుకుంటున్నారు.
పత్తి కొన్న తర్వాత మొత్తం డబ్బులు ఒక రైతు ఖాతాలోకి జమ చేయిస్తున్నారు. ఆ తర్వాత వారు తీసుకుని దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంగానీ, నిఘా పెట్టడంగానీ చేయడం లేదు.
ఎరువుల దుకాణదారులే ఎక్కువ?
ఎలక్ట్రిక్ కాంటాలు పెట్టకుండా పాత కాంటాలతోనే దళారులు పత్తి కొనుగోళ్లు చేపడుతూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కాంటాల్లో మొగ్గు చూపుతూ కిలో పత్తి తూకంలో కోత పెడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. కాంటాకు 10 కిలోల వరకు జీరోగా తూకం వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు.
ఎరువుల దుకాణదారులే ఈ దందాలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. వారి నుంచి రైతులు బకాయిపై పత్తి పంటకు పిచికారి, పురుగుమందులు కొంటుంటారు. రైతుల నుంచి డబ్బులు రావడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.
దళారులు చేస్తున్న మోసంతో రైతులకు పెట్టుబడి పోగా ఎకరాకు రూ.10 వేల వరకే లాభం పొందుతున్నారు. కానీ దళారులు మాత్రం ఎకరా పత్తిని కొంటే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు లాభం పొందుతున్నట్టు తెలుస్తున్నది.
కొనుగోలు కేంద్రాలు లేవు
పత్తిని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొను కేంద్రాలను ఏర్పా చేయడం లేదు. దళా వ్యాపారులకు వారు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. క్వింటాలుకు రూ.1,000 నష్టపోతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేం నా సమీపంలో ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది.
వెంకట్‌రెడ్డి, జువ్వాడి
విత్తనాలు ఇచ్చినప్పుడే ఒప్పందం
పత్తి విత్తనాలతో పా ఎరువులు, మందులు కొనుగోలు చేసేటప్పుడే ఆ వ్యాపారులు అగ్రిమెం చేసుకున్నారు. ధర పెరిగినా, తగ్గినా సం ఉండదు. అగ్రిమెంట్ చేసుకున్న ధరనే దళారి వ్యాపారులు చెల్లిస్తున్నారు. అగ్రిమెంట్ కారణంగా బయట అమ్మలే ప్రభుత్వం రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయడం లేదు. 120 కిలోమీటర్ల దూరంలో మద్నూర్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో వ్యాపారులకే అమ్ముతూ తీవ్రం నష్టపోతున్నాం.
లక్ష్మి, కొండాపూర్