calender_icon.png 15 March, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాన్సిరాం జయంతి వేడుకలు

15-03-2025 07:18:35 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షిరాం జయంతి వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఐబిలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత దేశ రాజకీయాల్లో ఒక సామాన్యుడు సైకిల్ పై బయలుదేరి విజయతీరాన్ని చేరుకున్నాడన్నారు.

చరిత్ర మరిచిన బహుజన మహనీయులందరినీ భారతదేశానికి, ప్రపంచానికి పరిచయం చేసింది, భారత రాజకీయాల్లో రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సిరాం అని కొనియాడారు. చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్  అధ్యక్షతన ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మంచిర్యాల పట్టణ నాయకులు మడిపల్లి రాములు, జిల్లా నాయకులు చెన్నూరి రాజు, కుమ్మరి కృష్ణ చైతన్య, సుందిళ్ల అశోక్, బేడ్డల రవి, తదితరులు పాల్గొన్నారు.