calender_icon.png 16 March, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి కానూరు దంపతుల లక్ష విరాళం

15-03-2025 08:13:52 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్-సౌజన్య దంపతులు రూ.1 లక్ష విరాళంగా శనివారం అందజేశారు. భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని అందించిన వీరు, ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయం అందించాలనే సంకల్పంతో ఈ దానం చేశారు. ఆలయ అధికారులు వీరి ఉదారతను అభినందిస్తూ, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఈ విరాళాలు తోడ్పడుతున్నాయని తెలిపారు. భద్రాచల శ్రీరాముల వారిపై అపార భక్తి కలిగిన భక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింతగా పాల్గొనాలని కోరారు.