calender_icon.png 20 April, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న కన్నెగంటి ‘భుజం మీద భూమి’ పుస్తకావిష్కరణ

14-03-2025 12:00:00 AM

ఖమ్మం, మార్చి 13 ( విజయక్రాంతి ): ప్రముఖ కవి, వాగ్గేయ కారుడు, పాఠ్య పుస్తక రచయిత, ప్రధానో పాధ్యాయులు కన్నెగంటి వెంకటయ్య కలం నుండి జాలువారిన ‘భుజం మీద భూమి’ కవితా సంపుటిని ఈ నెల 16న ఆవిష్కరించ నున్నట్లు జాషువా సాహిత్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు మువ్వా శ్రీనివాసరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని న్యూవిజన్ కాలేజీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వివుర్శకులు జి.లక్ష్మీనర్సయ్య, జిహెచ్‌ఎంఏ జిల్లా అధ్యక్షులు ఆర్.వీరాస్వామి, జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖరశర్మ హాజరై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ విమర్శకులు సైదులు ఐనాల సమీక్షిస్తారని తెలిపారు.జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభి మానులు, సాహిత్యాభి లాషులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.