తర్వాత కుమారుడి ఆత్మహత్య
నల్లగొండ, ఆగస్టు 25 (విజయక్రాంతి): కుటుంబ కలహాలు తల్లీకుమారుడిని బలి తీస్నుయి. మాజీ భార్యకు మరొకరరితో పెళ్లి జరగడంతో తట్టుకోలేక మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతల్లి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిడమనూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన వీరయ్య, సాయమ్మ దంపతుల చిన్నకుమారుడు శివకు 12 ఏళ్ల క్రితం తన సోదరి కుమార్తెతో వివాహమైంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. కోర్టు నుంచి విడాకులు పొందారు. మాజీ భార్యకు 24న మిర్యాలగూడలో వివాహం జరిగింది. ఆమె వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన శివ పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లి సాయమ్మ గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకొని తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ గోపాల్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హాలియా సీఐ జనార్దన్‌గౌడ్ క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు.