calender_icon.png 29 December, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్.. నటుడు అరెస్ట్

28-12-2024 11:16:49 AM

బెంగళూరు: ప్రముఖ కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను నటి ప్రైవేట్ వీడియోలతో లైంగిక వేధింపులకు గురిచేసి బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరి నగర్ పోలీసులు నటుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతనిపై సెక్షన్లు 115 (2), 308 (2),351(2), 352,  75(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు వచ్చిందని డీసీపీ (వెస్ట్) ఎస్ గిరీష్ శుక్రవారం తెలిపారు. 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న బాధితురాలికి చరిత్ బాలప్పతో 2023లో పరిచయం ఏర్పడింది. నిందితుడు నటిని ప్రేమాయణం సాగించాలని పట్టుబట్టి మానసికంగా వేధింపులకు గురిచేసి చంపేశాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు.