గచ్చిబౌలిలో విషాదం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1(విజయక్రాంతి): కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కన్నడలో పలు సీరియళ్లలో నటించిన ఆమె కొంత కాలం యాంకర్‌గా కూడా పని చేసింది. ప్రస్తుతం ఆమెకు 32 ఏండ్లు. గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి ఆమె గచ్చిబౌలిలో నివాసముంటోంది. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కాగా శోభిత శివన్న సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండేది. ఆమె నటించిన సీరియల్స్ ఫొటోలు, పోస్టర్స్‌ను అభిమానులతో పంచుకునేది.