calender_icon.png 6 March, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నడ నటి కిలాడీ!

06-03-2025 12:43:13 AM

  1. స్మగ్లింగ్ కేసులో విమానాశ్రయంలో పట్టుబడ్డ రాన్యారావు
  2. 17.29 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభ్యం
  3. సవతి తండ్రి కర్ణాటక డీజీపీ

బెంగళూరు, మార్చి 5: బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ హీరోయిన్ రాన్యారావు పట్టుబడింది. గడిచిన 15 రోజుల్లో రాన్యారావు నాలుగుసార్లు అరబ్ దేశాలకు వెళ్లి రావడాన్ని గమనించిన పోలీసులు.. విమానాశ్ర యంలో ఆమెను తనిఖీ చేయగా, ఆమె దగ్గర 14.2 కిలోల బంగారం లభించింది. రాన్యారావు సాధారణ ప్రయాణికురాలిలా బంగారంతో వచ్చేది.

విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ రాన్యాకు సాయం చేసేవాడు అని పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ అనంత రం డీఆర్‌ఐ పోలీసులు రాన్యారావు ఇంటిలో కూడా తనిఖీ చేశారు. తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు రూ. 2 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు రూ. 17.29 కోట్ల విలువైన బంగారంతో పాటు నగదు పట్టుబడినట్లయింది.

రాన్యారావు తరచూ అర బ్ దేశాలకు వెళ్లడమే కాకుండా ఒకే విధమైన దుస్తులు, బెల్టు ధరించడం గమనించిన పోలీసులు ఆమెపై నిఘా పెంచి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఆర్థిక నేరా ల కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రాన్యారావు తమిళంతో పాటు పలు కన్నడ సినిమా ల్లో కూడా హీరోయిన్‌గా నటించింది. 

బ్లాక్‌మెయిల్ చేశారు!

స్మగ్లింగ్ చేయాలని కొంత మంది వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేశారని దర్యాప్తులో రాన్యారావు చెప్పినట్లు సమాచారం. కేవలం రాన్యారావును మాత్రమే కాకుండా ఆమెకు విమానాశ్రయంలో సహా యం చేసిన కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు విచారించారు.

హీరోయిన్ రాన్యారావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రారా వు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. రామచంద్రారావు మాట్లాడుతూ.. రాన్యాకు తమకు ఎటువంటి సంబంధాలు లేవని తెలిపారు. నాలుగు నెలల క్రితమే ఆమెకు వివాహం అయిందని పేర్కొన్నారు. అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యానన్నారు.