calender_icon.png 23 January, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహస్యాల దీవి కోసం ‘కంగువ’ పోరాటం

13-08-2024 12:00:00 AM

స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన వ్యక్తిగా బాబీ డియోల్ ఇందులో కనిపించారు.

తానొక్కడే ఒక సైన్యంతో సమానమైన ‘కంగువ’ పాత్రలో సూర్య మేకోవర్‌ను ఇందులో చూడొచ్చు. రహస్యాలెన్నో దాచుకున్న దీవిలోని తన వారిని కాపాడుకునేందుకు నాయకుడిగా కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా కట్టిపడేస్తున్నాయి. ఇక భారీ నౌకలపై చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలైతే ప్రపంచ స్థాయి సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణ. ఇలా ట్రైలర్‌తో అహో అనిపిస్తున్న ‘కంగువ’ను చూడాలంటే అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే. దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కానున్న ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.