calender_icon.png 10 January, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్కార్ బరిలో కంగువా

08-01-2025 12:00:00 AM

శివ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా రూపొందింది ‘కంగువా’. గతేడాది విడుదలైన చిత్రం ఏ భాషలోనూ ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో చిత్ర యూనిట్ కొంత నిరుత్సాహానికి గురైంది. ఇది సూర్య కెరీర్‌లో నే తొలి భారీ బడ్జెట్ చిత్రంతోపాటు తొలి పాన్ ఇండియా చిత్రం కూడా కావడం గమనార్హం. తాజాగా సూర్యతోపాటు ఈ సినిమా మేకర్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

దీనికి కారణం ‘కంగువా’కు ఆస్కార్‌కి ఎంట్రీ లభించడమే. 2025వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 323 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో 207 సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. ఆసక్తికరంగా వాటిలో మన భారతదేశానికి చెందిన మూడు సినిమాలు ఆస్కార్ లిస్ట్‌లో చోటు దక్కించు కున్నాయి. ‘కంగువా’తో పాటు మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ఆడు జీవితం’, హిందీ సినిమా ‘స్వతంత్ర వీర సావర్కర్’ ఆస్కార్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘లాపతా లేడీస్’ చిత్రం ఆస్కార్ రేస్‌లో నిలిచింది కానీ షార్ట్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకోలేకపోయింది.