22-04-2025 10:49:01 PM
కంగ్టి: మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. ప్రభుత్వ విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 67 పరీక్షలు రాయగా21 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ విద్యార్థులు 69 మంది విద్యార్థులకు గాను 46 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ విభాగంలో బైపీసీలో కాలేజీ టాపర్గా ప్రియదర్శిని బైపిసి (874/1000) కే కనికర బైపిసి(773/1000) కే సుజాత బైపిసి (761/1000) మొదటి సంవత్సరంలో భాగ్యవతి (354/440) సిద్దేశ్వరి (327/400) కృష్ణవేణి బైపిసి(309/400) 136 విద్యార్థులు పరీక్షలు రాయగ అందులో 67 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం అభినందించారు.