నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులు చేసింది. డకెట్ (95) టాప్ స్కోరర్ కాగా.. విల్ జాక్స్ (62) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో జంపా, లబుషేన్ చెరి మూడు వికెట్లతో మెరిశారు. అనంతరం 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకోవడం విశేషం. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్; 5 సిక్సర్లు, 20 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1 ఆధిక్యంలో నిలిచింది.