calender_icon.png 16 January, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంగారు’లు పడ్డారు

15-09-2024 12:00:00 AM

  1. 193 పరుగులు చేసినా దక్కని విజయం
  2. మెక్‌గుర్క్ మెరుపులు వృథా

కార్డిఫ్ (ఇంగ్లండ్): ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 3 వికెట్ల తేడాతో మరో 6 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టన్ సాల్ట్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెక్‌గుర్క్ 50 (31 బంతుల్లో; 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరిసినా కానీ ఫలితం లేకపోయింది.

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ 87 (47 బంతుల్లో ; 6 ఫోర్లు, 5 సిక్సులు) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. కంగారూ బౌలర్లలో షార్ట్ 5 వికెట్లు, అబాట్ 2 వికెట్లు తీసుకున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆసీస్ గెలవగా, ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించి 1 సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో టీ20 నేడు జరగనుంది.