calender_icon.png 21 September, 2024 | 3:24 PM

అధికారం కోసం దేశాన్ని విడదీసేందుకు కూడా రాహుల్ వెనుకాడరు

21-09-2024 12:53:03 PM

ముంబైకంగనా రౌనత్ తన తాజా సినిమా  'ఎమర్జెన్సీ' విడుదల  ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాహుల్ పై విమర్శల వర్షం కురిపించడం ద్వారా  సినిమాకు ప్రచారం, ప్రమోషన్లు చేసుకోవచ్చని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది.. అందుకే రాజకీయ విమర్శల బాణాన్ని ఎక్కు పెట్టారు.. 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజీపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్ మండిపడ్డారు. భారత్ లో  కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావం ఆరెస్సెస్ లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లనప్పడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు  చేస్తరో ప్రజలందరికీ తెలుసని చెప్పారు.అధికారం కోసం దేశాన్ని విడదీసేందుకు కూడా రాహుల్ వెనుకాడరని  ఆమె అన్నారు.

తన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ ఇంకా రాకపోవడంపై కంగన స్పందిస్తూ... ఇదొక భారీ బడ్జెట్ మూవీ అని... జీ, మరికొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ తాము ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందని అన్నారు.