ఎంపీకి నోటీసులు పంపిన కోర్టు
చండీగఢ్, సెప్టెంబర్18: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చండీగఢ్‌లోని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు ఇంకా ఆటంకాలు తొలగడం లేదు. ఆ మూవీలో సిక్కులను కించపరిచేలా చిత్రీకరించారని పేర్కొ ంటూ చండీగఢ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ కంగనకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీని కంగనా నిర్మించారు.
చిత్రంలో సిక్కులను తప్పుగా చూపించారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని అకాలీదళ్ సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో ఈ సినిమా వివాదంలో చిక్కు కుంది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన ఎమర్జెన్సీ మూవీ నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ పొందడంలోనూ ఆలస్యం జరుగుతండడంతో మూవీ రిలీజ్ వాయిదా పడుతోంది. దీంతో సరైన సమయానికి చిత్రం విడుదల కాకపోవడంతో తాను నష్టాల పాలయ్యా యని ఆమె తెలిపారు.