calender_icon.png 16 January, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయా బచ్చన్ పేరు వివాదంపై కంగనా వ్యాఖ్యలు

03-09-2024 03:09:27 AM

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో జయా బచ్చన్ పేరు వివాదస్పదమైన విషయం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. జయాను ‘జయా అమితాబ్ బచ్చన్’ అని పిలిచారు. దీనిపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం చేస్తూ.. ‘జయా బచ్చన్’ అని పిలిస్తే సరిపోతోంది కదా స్పందించింది. ‘రికార్డుల్లో మీ పేరు ఇలానే ఉంది’ అని ఆయన సమాధానం ఇవ్వగా.. మళ్లీ జయా కల్పించుకొని ‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ ఘాటుగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అయితే నిత్యం వివాదాల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయా బచ్చన్ వాదంపై స్పందించారు. ఈ ఘటన సిగ్గుచేటని, స్త్రీ, పురుషుల మధ్య సహజ విభేదాలను వివక్షగా చూస్తున్నారని కంగనా రనౌత్ విమర్శించారు. ‘ఇది చాలా చిన్న విషయం. ఇలాంటి అహంకారం కుటుంబ బంధాలను దెబ్బతీస్తుంది. స్త్రీ, పురుషుడు కలిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. జయా బచ్చన్ వ్యవహరం వల్ల స్రీవాదం పక్కదారి పడుతుంది” అని  కంగనా వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే కంగనా ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదల వివాదాల కారణంగా వాయిదా పడుతూవస్తోంది.