calender_icon.png 28 September, 2024 | 8:47 AM

క్షమాపణలు చెప్పిన కంగనా

26-09-2024 02:39:44 AM

సాగుచట్టాలపై కామెంట్స్ వెనక్కి..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కంగనా స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సాగు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. ‘నా వ్యాఖ్యలతో చాలా మంది అసంతృప్తి చెందారు. ప్రస్తుతం నేను కేవలం నటిని మాత్రమే కాదు రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నేను మాట్లాడిన ప్రతీ విష యం మా పార్టీ వైఖరిని కూడా ప్రతిబింబిస్తుందనే విషయం అర్థమైంది.

నా వ్యాఖ్యల తో ఎవరైనా ఇబ్బంది పడితే అందుకు క్షమాపణలు కోరుతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి బాధ్యత. అని కంగనా పేర్కొన్నారు. మంగళవారం తన నియోజకవర్గ మైన మండిలో విలేకరులతో మాట్లాడుతూ.. ర

ద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని అన్నారు. రైతుల శ్రేయస్సుకు ఉపయోగకరమైన చట్టాల కోసం అన్నదాతలే డిమాండ్ చేయాలన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ పాలసీని నిర్ణయించేదెవరు? : రాహుల్

సాగు చట్టాలపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. దేశంలో మళ్లీ దుమారం రేపాలని ప్రయత్నిస్తున్నారా అని మండిపడ్డారు. కంగ నా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విధా నాలను ఎవరు నిర్ణయిస్తారు? కంగనానా? లేదా ప్రధాని మోదీనా? 750 మంది రైతులు బలిదానం చేసినా బీజేపీ నేతలకు సంతృప్తి లేదా? రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రను ఇండియా కూటమి ఎప్పటికీ అనుమతించదు. రైతుల విషయంలో మళ్లీ అలాంటి చర్యలు తీసుకుంటే మోదీ క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.