భారత్‌తో టెస్టు సిరీస్
ఆక్లాండ్: భారత్‌తో అక్టోబర్ 16 నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం కివీస్ బుధవారం జట్టును ప్రకటించింది. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. మూడు టెస్టులకు బెంగళూరు, పూణే, ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.17 మంది సభ్యుల బృందంలో విలియమ్సన్ స్థానంలో చాప్‌మన్‌కు అవకాశం కల్పించింది. ఇక మైకెల్ బ్రాస్‌వెల్ తొలి టెస్టుకు మాత్రమే ఎంపికవ్వగా.. బౌలర్ ఇష్ సోదీ రెండు, మూడు టెస్టులకు ఎంపికయ్యాడు.