calender_icon.png 17 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుతున్న తమిళ్ తలైవాస్ దశ కుమ్మేస్తున్న ‘కండోలా’

14-11-2024 01:35:28 AM

  1. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న యంగ్ రెయిడర్
  2. 11వ సీజన్‌లో మారిన తమిళ రాత..

కబడ్డీ అంటేనే సర్కస్ ఫీట్లకు పెట్టింది పేరు. అటువంటి ఆటలో రెయిడర్లు గాల్లోకి ఎగిరి జంప్ చేయడాలు, ఫ్లుయింగ్ రెయిడ్లు, హై ఫ్లయర్స్‌కు కొదవే లేదు. ఏ రెయిడర్ అయినా కానీ సక్సెస్ కావాలంటే కేవలం నేల మీద ఉంటూ రెయిడ్ పాయింట్లు చేస్తే సరిపోదు. అంతకు మించి సాధించినపుడే ఏ రెయిడర్‌ని అయినా సక్సెస్ వరిస్తుంది. అటువంటి ఓ రెయిడరే నరేందర్ హోషియార్ కండోలా.. 

విజయక్రాంతి ఖేల్ విభాగం: తమిళ్ తలైవాస్ జట్టు ప్రొకబడ్డీ లీగ్‌లోకి 2017లో ఎంట్రీ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా టాప్‌న జట్టుగా జర్నీని ముగించలేదు. ఎన్ని సీజన్లు ఆడినా కానీ కలిసి రాని టాప్ పొజీషన్ ఈ సారి నరేందర్  కండోలా, సచిన్‌లు తీసుకువస్తున్నారు.

ప్రతి సీజన్‌లో 22 మ్యాచ్‌లు ఆడుతున్నా కానీ పెద్దగా ప్రభావం చూపని తమిళ తంబీలు ఈసారి అదరగొడుతున్నారు. తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్ అంటే ఏ జట్టయినా కానీ వణికేలా పరిస్థితి మారి పోయింది. ఇన్ని రోజులు ఓడిపోయి ప్రత్యర్థి జట్లకు పాయింట్లు సమర్పించుకునేందుకే ఆడిన తమిళ్ ఈసారి మాత్రం సరికొత్తగా కనిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో తమిళ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడింది. 

కుమ్మేస్తున్న ‘కండోలా’ 

తమిళ జట్టుకు స్టార్ రెయిడర్ సచిన్‌తో పాటుగా, యువ రెయిడర్ నరేందర్ కండోలా కూడా ఆడుతున్నా డు. తమతోనే ఉన్న యువ రెయిడర్ నరేందర్ కండోలా మీద అపారమైన నమ్మకం ఉంచింది. గత సీజన్లలో అంతగా పర్ఫామ్ చేయకపోయినా కానీ మరోమారు అవకాశాలు ఇచ్చింది. ఈ అవకాశాలను సద్విని యోగం చేసుకున్న కండోలా ప్రత్యర్థుల మీద రంకెలేస్తూ వారిని కుమ్మేస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కండోలా 63 రెయిడ్ పాయింట్లు సాధించి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. 

హ్యాట్రిక్ ఓటములు 

కొద్ది రోజుల క్రితం వరకు తమిళ జట్టుకు  ఎదురేలేకుండా పరిస్థితులు ఉండేవి. ఆ జట్టు ఆటగాళ్లు రెయిడింగ్‌కు వెళ్లినా, ట్యాకిల్స్‌లో పాల్గొన్నా కానీ వారికి పాయింట్లు వచ్చాయి. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. అసలు తమిళ జట్టుకు విజయం రుచి ఎలా ఉంటుందో కూడా 

తెలియకుండా పోయిం ది. చివరి మూడు మ్యాచ్ ల్లో కూడా ఓడి... హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అప్పుడెప్పుడో అక్టోబర్ 23న విజయం సాధించిన తమిళ్ ఆ తర్వాత 6 మ్యాచ్‌లు ఆడినా కానీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

అపజయాల పరంపరకు బ్రేక్ 

నోయిడా: పీకేఎల్-11 సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ 47-28 తేడాతో బెంగాల్ వారియర్జ్ మీద ఘన విజయం సాధించిం ది. గుజరాత్ కెప్టెన్ రెయిడర్ గుమాన్ సింగ్ 17 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెంగాల్‌లో నితిన్ కు మార్ (11) సత్తా చాటిన ఉపయోగం లేకుం డా పోయింది.

ఈ విజయంతో గుజరాత్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37-32 తేడా తో పట్నా పైరేట్స్ మీద విజయం సాధించింది. రెండు జట్లలో ఎందులో కూడా సూ పర్ టెన్ నమోదు కాలేదు. 7 పాయింట్లతో దేవాంక్, అయాన్ టాప్ స్కోరర్లుగా ఉన్నారు.