మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చిన్నారి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా బాధితునికి పట్టణంలోని ఏఐటీయూసీ బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి కంది శ్రీనివాస్ దంపతులు అండగా నిలిచారు. మంగళవారం మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాలుడి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాలుని చికిత్స కోసం రూ.12200 తల్లిదండ్రులకు అందచేశారు. అనంతరం కంది శ్రీనివాస్ మాట్లాడుతూ... బి జోన్ కి చెందిన వరుణ్ (3) అనే బాలుడు ఇటీవల ప్రమాద వశాత్తు వేడి సాంబారు లో పడి 60% గాయాలు కాగా పేదరికం కారణంగా వైద్యం ఇబ్బంది కాకూడదని ఆశయంతో వాట్సాప్ ద్వారా విరాళాలు సేకరించి దాతల పేర్లతో సహా తల్లిదండ్రులకు అందచేశారు.బాలుని చికిత్సకోసం ముందుకు వచ్చిన కంది శ్రీనివాస్ దంపతులను పలువురు అభినందించారు.