calender_icon.png 16 February, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందుల కొనుగోలుకు కిరికిరి?

15-02-2025 01:09:44 AM

  1. కొనుగోలు కేంద్రాలు తెరిచారు  కొనడం మరిచారు
  2. అసలే లేటు ఆపై తేమ పేరుతో
  3. కామారెడ్డి జిల్లాలో కంది రైతుల అవస్థలు

కామారెడ్డి, ఫిబ్రవరి 14 (విజయ క్రాంతి), కందుల కొనుగోలులో రైతులకు అధికారుల కిరికిరి తప్పడం లేదు. అసలే కొనుగోలు కేంద్రాలను లేటుగా తెరిచారు. ఆపై తేమ సాకుతో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కిరికిరి చేస్తున్నారు. పంట రైతుల చేతికి రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం విడడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన పార్టీ సోయా కందులు మినుములు పెసలు వంటి వాణిజ్య పంటలు రైతులు పండిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారి వ్యాపారులకు వారు అడిగిన రేటుకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుంది. అధికారులు ముందుచూపుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో రైతులు మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. మధ్య దళారులు అడిగిన రేటుకు కట్ట పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు మద్దతు ధర లభించడం లేదు.

అధికారులు ప్రజాప్రతినిధుల పట్టింపు కరువు..

రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర లభించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్య దళారి వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 56,189 ఎకరాల్లో రైతులు కంది పంటను పండించారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారీ వ్యాపారులకు క్వింటాలుకు 6200 చొప్పున విక్రయించారు. ఈనెల 12న ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మద్నూర్ జుక్కల్ పిట్లం బిచ్కుంద తాడువాయి బొర్లం గాంధారి పద్మజ వాడి గ్రామాలలో కంది కొనుగోలు కేంద్రాలను మార్క్ పేడ్ అధికారులు ఏర్పాటు చేశారు. క్వింటాలుకు రూ ,7550 లు మద్దతు ధర ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు కందులను తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తుంటే కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కిరికిరి చేస్తున్నట్లు రైతులు తెలిపారు. 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాకులు కిరికిరి చేస్తున్నారు. దీంతో కందులు పండించి తెచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు.

పంట చేతికి వచ్చినా కొనుగోలు చేయడం లేదు

పంట చేతికి వచ్చేవరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. వచ్చిన పంటను నిలువ ఉంచేందుకు స్థలము లేదు. ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. తాము తీవ్రంగా నష్టపోతున్నాం.

 -నరసవ్వ, మహిళా రైతు, కొండాపూర్, కామారెడ్డి జిల్లా,

12% తేమ శాతం ఉంటే నే కొనుగోలు చేస్తున్నాం

కామారెడ్డి జిల్లాలో 8 కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. తేమ శాతం ఎక్కువ ఉంటే ఎండబెట్టాలని రైతులకు సూచిస్తున్నాం. రైతులు 12 శాతం తేమ గల కందులను తెస్తే వెంటనే కాంటా పెట్టుకుంటున్నాం.

 -మహేష్ కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం, కామారెడ్డి


తేమ ఉందని కాంట చేస్తలేరు

కొనుగోలు కేంద్రానికి తెచ్చిన కందులను తేమ సరిగా లేదంటూ 15 రోజులుగా  పడిగాపులు కాస్తున్నా. ఇంకా కొంత లేరు.

 -రామ్ సింగ్, రైతు, యాచారం, కామారెడ్డి జిల్లా