రూ10.వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జాహిద్
పెద్దపల్లి, ఆగస్టు 3(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా శనివారం రూ.10వేలు లం చం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండలంలోని మందమర్రికి చెంది న కాడం తిరుపతి అనే రైతు నుంచి తహసీల్దార్ జాహిద్ పాషా, వీఆర్‌ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్‌లు రూ10.వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మండలంలోని మందమర్రికి చెందిన కాడం తిరు పతి అనే రైతుకు పందిళ్ల గ్రామ శివారులో 28 గుంటల భూమి ఉంది.
ఆ భూమిని ఇతరులు కబ్జాకు పాల్పడటంతో.. మల్లయ్య కుమారుడు తిరుపతి జిల్లా అధికారులను కలిసి గత నెల 23న మోటేషన్ పూర్తి చేసుకున్నాడు. మోటేషన్ కోసం లంచం డిమాం డ్ చేయడంతో గతంలోనే వీఆర్‌ఏ మల్లేశం కుమారుడు విష్ణుకు ఫోన్ పే ద్వారా రూ.15 వేలు పంపారు. అయినా కూడా మరో రూ. 10వేలు ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం తిరుపతి నుంచి రూ.10 వేల నగదు తీసుకుంటుండగా తహసీల్దార్ పాషా, వీఆర్‌ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాద్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.