* 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ముంబైకి చెందిన కామ్య కార్తికేయన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధిం చింది. 17 ఏండ్ల వయసున్న ఈ యువతి ముంబైలోని నేవీ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతుంది.
నేవీలో పనిచేస్తున్న తన తండ్రి ఎస్ కార్తికేయన్‌తో కలిసి ఈ నెల 24న అంటార్కిటికాలోని మౌంట్ విన్సెంట్‌ను అధిరోహించి ఈ ఘనత సాధించింది. భారత నావికాదళం కామ్య కార్తికేయన్‌తో పాటు ఆమె తండ్రి కార్తికేయన్‌కు అభినందనలు తెలిపింది.
13 ఏండ్లకే తన ప్రయా ణాన్ని ప్రారంభించిన కామ్య కార్తికేయన్ ఇంతకుమందు ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, ఐరోపాలోని మౌంట్ ఎల్‌బ్రస్ సహా ఏడు ఖండాల్లోని ఎత్తున శిఖరాలను అధిరోహించింది.