calender_icon.png 3 April, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిండేపై కమ్రా వ్యాఖ్యల దుమారం

25-03-2025 12:00:00 AM

  1. భగ్గుమన్న శివసేన శ్రేణులు
  2. ముంబైలో హాబిటాట్ స్టూడియో ధ్వంసం
  3. 12 మంది అరెస్ట్.. కొద్ది గంటల్లోనే బెయిల్‌పై విడుదల
  4. క్షమాపణలు చెప్పాల్సిందే: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
  5. కమ్రాకు ఉద్ధవ్ మద్దతు

ముంబై, మార్చి 24: కామెడీ షోలో భాగంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పేరును ప్రస్తావించకుండా అధి కారం కోసం ఆయన పార్టీని చీల్చాడనే అ ర్థం వచ్చేలా స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ‘గద్దార్’(ద్రోహి) వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి.

అతడి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షిండే వర్గానికి చెందిన శివసేన కార్యకర్తలు కమ్రా కామెడీ షో నిర్వహించిన ఖార్ ప్రాంతంలోని ‘ది యూనికాంటినెంటల్’ హోటల్‌లోని హా బిటాట్ కామెడీ క్లబ్ స్టూడియోను ఆదివా రం రాత్రి ధ్వంసం చేశారు. దీంతో 12 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశా రు.

అయితే కొద్ది గంటల్లోనే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేయడంతో వాళ్లు సో మవారం జైలు నుంచి విడుదలయ్యారు.  ఈ క్రమంలోనే నిబంధనలు ఉల్లఘించారని పేర్కొంటూ హాబిటాట్ స్టూడియోకు సంబంధించిన కొన్ని నిర్మాణాలను బృహన్ ముం బై మున్సిపల్(బీఎంసీ) అధికారులు సోమవారం కూల్చివేశారు.

కాగా వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించి.. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని క్షమాపణలు చెప్పబోనని కమ్రా స్పష్టం చేశారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు కమ్రాకు మద్ద తు తెలుపగా.. షిండే వర్గానికి చెందిన ఎమ్మె ల్యే ముర్జి పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. 

కామెడీ షోలో కమ్రా ఏమన్నారంటే..

కామెడీ షోలో భాగంగా మహారాష్ట్ర రాజకీయాలపై కునాల్ కమ్రా విమర్శలు గుప్పిం చారు. ‘ముందుగా శివసేన బీజేపీ నుంచి బ  తర్వాత శివసేన నుంచి శివసేన బయటికొచ్చింది. అలాగే ఎన్సీపీ నుం  ఎన్సీపీ బయటికొచ్చింది. ఒక్క ఓటరుకు వాళ్లు తొమ్మిది బటన్లు ఇచ్చారు. దీంతో అందరూ అయోమయానికి గురయ్యారు’ అని విమర్శించారు.

ఈ క్రమంలోనే ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మా ర్చి ఏక్‌నాథ్ షిండే పేరును ప్రస్తావించకుం డా ఆయనను ద్రోహిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను క మ్రా సామాజిక మాద్యమంలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ అయింది. కమ్రా వీడియోను శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘కునాల్ కా కమల్’ అంటూ ఎద్దేవా చేశారు.

తీవ్ర వివాదస్పదం కావడంతో షిండే వర్గం శివసేన కా ర్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండేను విమర్శించడానికి కార్యకర్తలు లేకపోవడంతో యూబీటీ వర్గం కమ్రాను నియమించుకుందని శివసేన ఎంపీ నరేశ్ మస్కే విమర్శిం చారు. దేశంలో ఎక్కడికెళ్లినా క్షమాపణలు చెప్పే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు. 

క్షమాపణలు చెప్పాల్సిందే

నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చేసే వ్యాఖ్యలను ఎంత మాత్రం సహించబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. షిండేకు కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.

‘నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపర్చడం ఆమోదయోగ్యం కాదు. దిగజారుడు హాస్యం, ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’ అని క మ్రా తీరును ఫడ్నవీస్ ఖండించారు. ఎవ రూ చట్ట పరిధి దాటి వ్యవహరించకూడదని, ఎవరైనా హద్దుల్లో ఉండే మాట్లాడాలని డి ప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్నారు. 

పశ్చాత్తాపం చెందడం లేదు

డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై తాను పశ్చాత్తాపం చెందడం లేదని కమ్రా స్పష్టం చేశారు. తాను క్షమాపణలు చెప్పబోనని పేర్కొన్నారు. సీఎం దే వేంద్ర ఫడ్నవీస్ క్షమాపణల డిమాండ్‌పై స్ప ందించిన కమ్రా.. ఒక వేళ కోర్టు చెబితే తాను క్షమాణలు చెబుతానని స్పష్టం చేశారు. షిం డేను విమర్శించడానికి శివసేన (యూబీటీ) వర్గం వాళ్లు తనకు డబ్బులు ఇచ్చినట్టు వచ్చి న ఆరోపణలను ఆయన ఖండించారు.  

కునాల్ కమ్రాకు పూర్తి మద్దతు

షిండేపై కమ్రా చేసిన వ్యాఖ్యలను శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమర్థించా రు. కమ్రాకు పూర్తిగా తన మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.  ఆయన  మాట్లాడు తూ.. ‘కమ్రా తప్పు చేసినట్టుగా నేను భావించడం లేదు. ద్రోహి ద్రోహే’ అని పేర్కొన్నా రు. నాగ్‌పూర్ అల్లర్ల సమయంలో జరిగిన నష్టాన్ని ఆ ఘటనకు సంబంధించిన నిందితులతో భర్తీ చేసినట్టుగా షిండే వర్గం హాబిటాట్ స్టూడియోలో చేసిన నష్టానికి ప్రభత్వమే బాధ్యత వహించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.