పాక్, ఇంగ్లండ్ రెండో టెస్టు
ముల్తాన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పర్వాలేదనిపించిం ది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ తొలి రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (37*), అగా సల్మాన్ (5*) క్రీజులో ఉన్నారు.
బాబర్ ఆజం స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులాం (118) అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సయీద్ అయూబ్ (77) అర్థసెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాయంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వడంతో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.