గాలె: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు సాధించింది. రమేశ్ మెండిస్ (14), ప్రభాత్ జయసూరియా క్రీజులో ఉన్నారు. కమిందు మెండిస్ (173 బంతుల్లో 114) శతకంతో మెరిశాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50) అర్థశతకం సాధించాడు. కివీస్ బౌలర్లలో విలి యం రూర్కీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 2 వికెట్లు తీశాడు.