భువనేశ్వర్, జనవరి 3: ఒడిశా 27వ గవర్నర్‌గా శుక్రవారం కంభంపాటి హరిబాబు ప్రమాణస్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ చక్రధారి శరణ్‌సింగ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం మోహ న్ చరణ్ మాఝీ, ప్రతిపక్ష నేత, మా జీ సీఎం నవీన్ పట్నాయక్, మంత్రులు పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ రాజీనామా చేయడంతో మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటిని ఒడిశా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు.