మందమర్రి (విజయక్రాంతి): ఆది జాంబవ సంఘం పట్టణ నూతన అధ్యక్షులుగా కంబాల రాజనర్సు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పట్టణ నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. గతంలో అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వాసాల శంకర్ రాజీనామా చేయడంతో సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. కాగా, నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజనర్సుని మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీదునూరి శంకర్, దాసరి రాజనర్సు, తుంగపండి శ్రీనివాస్, విరుగురాల వెంకటిలు పాల్గొన్నారు.