calender_icon.png 10 February, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన కామారెడ్డి యోగా సభ్యులు

10-02-2025 01:47:11 AM

 కామారెడ్డి ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) సహస్ర సూర్య నమస్కార రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం సిద్దిపేటలో నిర్వహించారు. కామారెడ్డికి చెందిన యోగ సభ్యులు 12 మంది పోటీలో పాల్గొని వారి సత్తాను నిరూపించుకున్నారు యోగ సాధకుల లక్ష్యసాధన కోసం అలుపెరుగని సాధన చేస్తున్న జిల్లా యోగా అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆశయాల మేరకు కామారెడ్డి యోగా సభ్యులు రాష్ట్రస్థాయి యోగా పోటీలు ఎక్కడ జరిగిన పాల్గొని కామారెడ్డి సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు

యోగనే తన లక్ష్య ధ్యేయంగా పెట్టుకొని కృషి చేస్తున్న గడ్డం రాంరెడ్డి లక్ష సాధనలో భాగంగా యోగాసభ్యులు ఆయన ఆశయాలను నెరవేస్తున్నారు యోగాను ప్రజలకు దగ్గర చేసి వారి కుటుంబాలను రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా ఉండేందుకు చేస్తున్న కృషిలో భాగంగా యోగా సాధకులు కామారెడ్డి జిల్లాలో రోజు రోజుకు కు వారిలో పెరిగిన అవగాహన ఫలితంగా రాష్ట్రస్థాయిలో యోగా సాధకులు అనేక పథకాలను తీసుకోవస్తున్నారు

కామారెడ్డి జిల్లాలో మహిళా యోగ సాధకులు కూడా వారి యొక్క ప్రతిభను చూపుతున్నారు క్రమశిక్షణతో మహిళలు ప్రతిభను చాటుతున్నారు ఈ క్రమంలో భాగంగా సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర సహస్రనామం సూర్య నమస్కార పోటీలో పాల్గొని 11 మంది 1,010 నుండి 100 సూర్య నమస్కారాలు చేశారు యోగా సాధకులైన అజయ్ 1,010 ఎల్లయ్య 1000 రాజు 850  సంధ్య 540 కౌశిక్ 540 సురేందర్ శర్వాణి 241 హర్షిత 220 సోనియా 128 రాజ్ కుమార్ 100 సుదీక్ష 100 సూర్య నమస్కారాలు చేసి ప్రశంసా పత్రాలను అందుకోవడం జరిగింది

యోగ సాధకుల కృషి ఫలితంగా సాధించిన గుర్తింపుతో యోగా గురూజీ యోగ రామ్ రెడ్డి వీరికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యోగ గురువులు గడ్డం రామ్ రెడ్డి యజ్ఞ గురువు బాస రఘు కుమార్ యోగా సాధకులు పాల్గొన్నారు