calender_icon.png 3 April, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే కామారెడ్డి రవాణా శాఖ టాప్

02-04-2025 07:34:51 PM

కలెక్టర్, ఎస్పీల సహకారం మరువలేం..

రవాణా శాఖ అధికారులు సిబ్బంది సేవలు అమోఘం..

జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి రవాణా శాఖ కార్యాలయం రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులకు సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీల సహకారంతో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, కృషి వల్ల టార్గెట్ పూర్తి చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో టాప్ గా నిలిచామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా  జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈసారి రూ.73 కోట్ల లక్ష్యానికి గాను రూ. 68.19కోట్లు (92.4 శాతం) వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. అలాగే, హెల్మెట్‌ ధరించక ఏటా సుమారు 240 మంది మృత్యువాత పడుతున్నారని, ఈ సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కామారెడ్డి రవాణా శాఖ వాహనాల పన్నుల వసుళ్ళలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. అన్ని రకాల పన్నుల వసూళ్లలో కామారెడ్డి రవాణా శాఖ ముందంజ లో నిలిచింద న్నారు. గత సంవత్సరం అన్ని విభాగాల్లో కలిసి ఆరు కోట్ల 31, లక్షలు వసూలు చేయగా ఈ ఏడాది 2024- 25 సంవత్సరానికి 6 కోట్ల 81 లక్షల 8 ,099 రూపాయలు వసూలు చేసి రికార్డు సాధించామన్నారు.  గత సంవత్సరం కన్నా ఐదు కోట్ల 6, 6 లక్షల 700 రూపాయలు పన్ను బకాయలు వసూలు చేశామన్నారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర సహకారంతో రాష్ట్రంలో నే కామారెడ్డి రవాణా శాఖ పన్నుల వసూలు లో ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు సహకారంతో కమర్షియల్ వాహనాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించే పనులను కూడా సకాలంలో చెల్లించడంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో వచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్‌ ఎజాజ్‌ అహ్మద్, ఏఎంవీఐలు భిక్షపతి, అఫ్రోజ్, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు‌.