calender_icon.png 29 April, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి పోలీస్ బాస్ ఎస్పీ దూకుడు

26-04-2025 12:30:36 AM

పది రోజుల్లో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

కామారెడ్డి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా  ఎస్పీ  రాజేష్ చంద్ర తమ విధి నిర్వహణలో ’తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతున్నారు. శాంతిభ ద్రతల పరిరక్షణ కోసం ఆయన చేపడుతున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందు కుంటున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుం టున్నారు.అయితే పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల విషయంలో అవినీతి, అక్రమాల విషయంలో మాత్రం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పోలీసు అధికారులను కూడా ఉపేక్షించడం లేదు.

కామారెడ్డి జిల్లాలో పది రోజుల్లో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. మొన్నటికి మొన్న జుక్కల్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ కు గురి కాగా, తర్వాత రెండు రోజులకే తాడ్వాయి ఎస్త్స్ర వెంకటేశ్వర్లు, గురువారం రామారెడ్డి ఎస్త్స్ర నరేష్ పై వేటు వేయడం గమనార్హం.

కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షల ప్రశ్నలు బయటకు లీక్ కాగా వాటిని ఎస్పీ సమర్థవంతంగా కట్టడి చేశారు. పోలీసింగ్ ను గాడిన పెట్టడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఇటీవల పలువురు సిబ్బందిని సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనం.సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి రివార్డులు అందజేస్తున్నారు.