calender_icon.png 23 April, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ లో మెరిసిన కామారెడ్డి ఆణిముత్యాలు

22-04-2025 08:03:26 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి అంతంపల్లి గ్రామానికి చెందిన వలకొండ చర్విత ఎంపీసీలో 995 మార్కులతో రాష్ట్ర ర్యాంకు సాధించింది. విద్యార్థిని తల్లిదండ్రులు వెంకట్ రెడ్డి, అనురాధ రైతు కుటుంబం. చర్విత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తెలంగాణ మోడల్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కృష్ణా నగర్ తండాకు చెందిన అంగోత్ జ్యోతి బైపిసి లో 992 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ కమల్ కిషోర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... తమ కళాశాలలో 900 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 15 మందికి పైగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకులు సాధించడం పట్ల వారి గ్రామస్తులు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచినట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.