కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డితో సహా తెలంగాణ బిజెపికి చెందిన 8 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ సహా పలువురు బిజెపి ప్రతినిధులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. కీలకమైన రాష్ట్ర సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు అవకాశాలపై చర్చించారు. తెలంగాణకు చెందిన 18 మంది బిజెపి ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి పథాన్ని బలోపేతం చేయడం, కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బిజెపి చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.