కామారెడ్డి,(విజయక్రాంతి): జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌గా నియామితులైన పల్లె గంగారెడ్డిని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పసుపుబోర్డు జాతీయ చైర్మన్‌గా ఎంపికైన తరువాత గంగారెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే కలవడం మొదటిసారి కావడంతో నిజామాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గంగారెడ్డిని కలిసి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా పసుపురైతుల సమస్యలపై చర్చించారు. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే రమణారెడ్డి సూచించారు.