కామారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశమయిన పవిత్ర గంగానది ఒడ్డున కొలువైన కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. పదేళ్లలో వారణాసి పట్టణాన్ని, కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎంతో అభివృద్ధి చేశారని కొని యాడారు.