calender_icon.png 23 December, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి వైద్యశాఖకు సెలవుల జ్వరం!

07-10-2024 12:00:00 AM

మరోసారి 15 రోజుల లీవ్‌లో జిల్లా వైద్యాధికారి

పెండింగ్ బిల్లుల కోసం అక్రమార్కుల ఎత్తుగడ?

కలెక్టర్ హెచ్చరించినా మారని అధికారుల తీరు 

కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): కామారె డ్డి జిల్లాలోని కొందరు వైద్యశాఖ అధికారుల తీ రు మారడం లేదు. జిల్లావైద్యాధికారిగా విధుల్లో చేరేందుకు వచ్చిన వైద్యాధికారి పద్మ మరోసారి 15 రోజుల సెలవును పొ డగించుకున్నారు. జిల్లా వైద్యశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు తమకు రావాల్సి న పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసమే ఏకంగా జిల్లా వైద్యాధికారితో సెలవు పెట్టించారని ఆ శాఖలో తీవ్రంగా చర్చ సాగుతోంది.

జిల్లా వైద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరిని స్వయంగా కలెక్టర్ హెచ్చరి ంచినా పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు డ్యూటీలకు డుమ్మాలు కొడుతూ ఇష్టానుసారంగా వెళ్తున్నారనే ఉద్దేశంతో కలెక్టరేట్‌లో రెండు బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయించారు.

అయి నా ఉన్నతాధికారు లు కార్యాలయానికి వచ్చినప్పుడు బయోమెట్రిక్ పెట్టడం, బయటకు వెళ్లే సమయంలో నమోదు చేయకుండా వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసమేనా?

జిల్లా వైద్యాశాఖలో పెండింగ్ బిల్లులను పొందేందుకు కొందరు అధికారులు ఎత్తుగడ వేసి వైద్యాధికారిని సెలవుపై పంపినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇంచార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, మరికొంతమంది పీవోలు, ఇతరులకు రావాల్సిన బకాయి బిల్లులు 15 రోజు ల్లో క్లియరెన్స్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

వైద్యశాఖలో పనిచేస్తున్న కొంద రు అధికారులు తమ స్వంత వాహనాలనే అ ద్దె కార్లుగా చూపుతూ నెలనెలా బిల్లులు పొం దుతున్నట్టు ఆరోపణలు ఉ న్నాయి. ఆరు నెలలుగా వాటికి సంబంధించిన బిల్లులు పెండిం గ్ ఉన్నాయి. వాటిని క్లి యరెన్స్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవని భావించిన సదరు అధికారులు.. 

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో బాధ్యతల్లో ఉన్న సమయంలో బిల్లులు క్లియర్ చేసేందుకు స్కెచ్ వేసినట్టు సమాచారం. జిల్లా వైద్యాధికారి పద్మ విధుల్లో చేరితే వాహన బిల్లులు, ఇతర బిల్లుల గురించి ప్రశ్నించి నిలిపివేస్తే నష్టపోతామని భావించే ఇలా ఆమెను సెలవుపై వెళ్లేలా చేశారని చర్చ నడుస్తోంది.  

రోగుల అవస్థలు.. అధికారుల డుమ్మాలు

ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, విష జ్వరాలతో బాధపడుతుంటే.. కామారెడ్డి జిల్లా వైద్యాశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు విధులకు డుమ్మాలు కొడుతున్నారు. కొత్త కలెక్టర్ వచ్చిన సమయంలో అధికారులు, వైద్యులు, సిబ్బంది భయంతో విధులకు హాజరయ్యేవారు. ఇప్పుడు డుమ్మాలు కొట్టే ఆలోచనలో ఉన్నవారు అటెండెన్స్ రిజిస్టర్‌లో ముందుగానే సెలవు పత్రాన్ని పెడుతున్నారు.

కలెక్టర్ పర్యవేక్షణకు వస్తే ఆ లీవ్ లెటర్ చూపించి సెలవుపై వెళ్లారని చెప్పేలా ప్లాన్ వేసుకుంటున్నారు. పర్యవేక్షణకు ఎవరు రాకుంటే మరుసటి రోజు సంతకాలు పెట్టి సెలవుపత్రాన్ని చించివేస్తున్నారు. ఇదంతా ఎక్కడో జిల్లా కేంద్రానికి సమీపంలోని దవాఖానల్లో జరుగుతున్న తతంగం.

కొందరు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రైలులో రావడం, మధ్యాహ్నం 3 గంటలకే రైలెక్కడం షరామామూలుగా మారింది. ఇకనైనా కలెక్టర్ దృష్టిసారించి, ప్రజలకు వైద్య సేవల్లో లోపం లేకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.