calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జే ఎన్ యు ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా విద్యార్థి

19-04-2025 05:59:07 PM

కామారెడ్డి (విజయక్రాంతి): జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికలకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థులను ప్రకటించారు. అధ్యక్షురాలుగా షికా స్వరాజ్ ఉపాధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కామారెడ్డికి చెందిన నీట్టు గౌతమ్ ప్రధాన కార్యదర్శిగా కునాల్రాయి సంయుక్త కార్యదర్శిగా వైభవ్ మీనాలను ఏబీవీపీ శాఖ ప్రకటించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన నెట్టు గౌతమ్ ఉపాధ్యక్షులుగా బరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక విద్యార్థి పోటీలో ఉన్నారు.

నీట్టు గౌతమ్ కామారెడ్డి జిల్లా చెందిన విద్యార్థి ఫరీదాబాద్ లోని లింగయ్య విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సిస్టం లో బీటెక్ పూర్తి చేశారు జె ఎన్ యు లో కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ పట్టాను పొందారు. ప్రస్తుతం అక్కడే పి హెచ్ డి చేస్తున్నారు. వామపక్ష ఆధిపత్యాన్ని ఏబీవీపీ సవాల్ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు ఖాయమని విజయక్రాంతి తో నీట్టు  గౌతమ్ తెలిపారు.