27-04-2025 05:50:44 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో నిర్వహించనుండడంతో ఆదివారం కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి(BRS President Jukanti Prabhakar Reddy) కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వరంగల్ సభను విజయవంతం చేయాలని నాయకులను, పార్టీ కార్యకర్తలను కోరారు.
బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 21న పురుడు పోసుకున్న టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి నేటికీ 25 సంవత్సరాల సంబరాలను జరుపుకునేందుకు ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి భారీ జన సమీకరణ చేసి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను తరలించారు. ఈ సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలలో వరంగల్ సభకు బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు.