ప్రభుత్వానికి బీసీ నేత రాజారాంయాదవ్ డిమాండ్
నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీగణన జరుపాలని, అందుకు తగ్గట్టుగా బీసీ రిజర్వేషన్లను పెంచాలని బీసీ నేత రాజారాంయాదవ్ డిమాండ్ చేశారు. కులగణనకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన చలో ఆర్మూర్ బీసీ సదస్సుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులుతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడు తూ.. బీసీలు ఉద్యమించినప్పుటడే రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీలు సామాజికంగా వెనుకబడి ఉన్నారని, వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.