calender_icon.png 19 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులను బహిష్కరించిన కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు

17-04-2025 07:18:18 PM

అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేసి అమలు  చేయాలి..

కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్..

కామారెడ్డి (విజయక్రాంతి): సూర్యాపేటలో న్యాయవాది ఎం కిషోర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ తెలిపారు. కోర్టు ముందు న్యాయవాదులపై దాడులు సిగ్గుచేటని, న్యాయవాదులపై దాడులు చేసే దుండగులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టర్ న ఏర్పాటు చేసి అమలు చేయాలన్నారు. ఈ మధ్య అడ్వకేట్లపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, అడ్వకేట్ కిషోర్ పై దాడి చేసిన దుండగులను పట్టుకొని వెంటనే  కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళి, న్యాయవాదులు జగన్నాథం, సిద్ధ రాములు, లక్ష్మణరావు, రజనీకాంత్, సంతోష్ శర్మ, చింతల గోపి తదితరులు పాల్గొన్నారు.