కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ఇంచార్జి మున్సిపల్ కమిషనర్‌గా శ్రీహరి రాజు మంగళవారం బాధ్యతలను చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీహరి రాజు కామారెడ్డి ఇంచార్జి మున్సిపల్ కమిషనర్‌గా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చారు. బి.ఎల్‌టియు కామారెడ్డి జిల్లా నాయకులు వడ్ల సాయికృష్ణ, గంగామణి, మర్యాదపూర్వకంగా ఇంచార్జి కమిషనర్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది అధికారులు సహకరించాలని కొరారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు.